స్టేషనరీ పేరుతో బాణాసంచా స్మగ్లింగ్!
చెన్నై పోర్టులో (Chennai Port) భారీగా చైనా బాణాసంచాను డీఆర్‌ఐ అధికారులు (DRI Officials) స్వాధీనం చేసుకున్నారు. స్టేషనరీ, మెడికల్ గ్లోవ్స్ పేరుతో బాణాసంచాను అక్రమంగా దిగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ (Hair Bands & Clips), వార్డ్‌రోబ్‌లు, షూ రాక్స్ పేరుతో కంటైనర్లను తరలించినట్లు సమాచారం. అనుమానాస్పదంగా కనిపించిన కంటైనర్లను తనిఖీ చేయగా.. కార్టన్ల వెనుక భారీగా చైనా బాణాసంచా బయటపడింది.
ఇవి కూడా చదవండి: ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీల ర్యాలీ!
అనుమతులు లేకుండానే బాణాసంచాను దిగుమతి (Illegal Import) చేసినట్లు అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన బాణాసంచా విలువ రూ.12 కోట్లకు పైమాటేనని అధికారులు తెలిపారు.ఈ వ్యవహారంలో అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ (Smuggling Network)పై డీఆర్‌ఐ అధికారులు దృష్టి సారించారు. బాణాసంచా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు? ఎవరి కోసం తరలిస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.