8 June, 2026 | 10:28 PM

అంగన్వాడిలో ఈసీసీఈ డే నిర్వహణ

28-03-2026 03:38 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలలో ప్రతినెల నాలుగో శనివారం నిర్వహించే ఈసీసీఈ డే కార్యక్రమాన్ని పట్టణంలోని వెంగళరావు కాలనీ 11, 15వ వార్డులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ మొగిలి లక్ష్మి, 15వ వార్డు కౌన్సిలర్ సోనీ భాయ్ పాల్గొని మాట్లాడుతూ... అంగన్వాడిలో పిల్లలకు అందించే పౌష్టికాహారం, గర్భిణీల ఆహారం, పిల్లల ఎదుగుదల, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించి పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం కౌన్సిలర్ మొగిలి లక్ష్మిని శాలువాతో సత్కరించారు.