29 July, 2026 | 9:55 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

అక్రమ మైనింగ్ పై అసెంబ్లీలో మాటల యుద్ధం

28-03-2026 03:30 PM

నాపై చర్యలు తీసుకోండి.. నన్ను ఊరితీయండి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్ అంశంపై(Illegal Mining) అసెంబ్లీలో మాటలు తూటాలు పెలుతున్నాయి. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కంపెనీ అక్రమమైనింగ్ కు పాల్పడుతోందని హరీశ్ రావు ఆరోపించారు.

మంత్రి రాజీనామా చేస్తేనే విచారణ సజావుగా సాగుతోందన్నారు. తాను తప్పు మాట్లాడితే తనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రాఘవ కన్ స్ట్రక్షన్ గురించి ప్రజలందరికీ తెలుసన్న హరీశ్ రావు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి క్రషర్ లో చిన్నతప్పు జరిగిందని తీసుకెళ్లి జైలులో పెట్టారని హరీశ్ రావు గుర్తుచేశారు. పొంగులేటికి చెందిన రాఘవ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

''నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఊరి తీయండి, లేదా తప్పుచేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి'' అన్నారు. ప్రతిపక్ష నేతలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే జైలులో పెడతారన్న హరీశ్ రావు ఇసుక స్కామ్ లో ప్రభుత్వ పెద్దలు లేకుంటే వెంటనే కమిటీ వేయాలన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. హరీశ్ రావు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ పై విచారణ జరుపుతామని చెబుతున్నా.. మంత్రులను టార్గెట్ చేసేలా హరీశ్ రావు మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. హరీశ్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.