29 July, 2026 | 9:30 PM

Breaking News

తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •  

చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం

29-07-2026 08:45 PM

చిట్యాల,(విజయక్రాంతి): సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్ విజయ్ కుమార్ అధ్యక్షతన సర్ -2026 కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని అన్ని రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, ప్రతినిధులతో తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ -2026 ప్రక్రియలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా వివరించారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటర్ల జాబితాల క్రోడీకరణ, ఓటర్ల బదిలీలు, పేర్ల చేర్పు, తొలగింపు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి, వారి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు. ఓటరు జాబితాలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సర్ -2026 ప్రక్రియ విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్ కార్యాలయ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.