చదువే మనకు నిజమైన ఆస్తి
క్రమశిక్షణతో చదివితే విజయం మీ సొంతం
మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
కామారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): చదివే మనకు నిజమైన ఆస్తి అని, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. శనివారం కామారెడ్డి విద్యానగర్ కాలనీలో సీనియర్ సిటిజన్ హాల్లో నిర్వహించిన ముదిరాజ్ ప్రతిభ పురస్కారాలు 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిపాకుల మరి ఉత్తమ ఫలితాలు సాధించిన ముదిరాజ్ ముద్దుబిడ్డల కు సన్మానించడం గొప్ప వరమన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కష్టపడి చదివి తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చు కోవాలన్నారు.
చదువుతోనే మన సమాజం మరింత ముందుకు వెళ్తుందన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, చదివిన పాఠశాలకు కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. తల్లితండ్రుల ఆశయాల కనుగుణంగా ఉన్నతమైన చదువు చదివి తమ లక్ష్యాలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమం కేవలం అవార్డులు ఇవ్వడానికే కాదు, చదువుకుంటున్న మిగతా విద్యార్థులలో కూడా ఒక కొత్త స్ఫూర్తిని, పట్టుదలను నింపడానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. మరొక్కసారి విజయం సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గజ్జల బిక్షపతి, మాజీ జెడ్పిటిసి నంద రమేష్, కాళ్ళ గంగరాజు,కౌన్సిలర్లు , కాళ్ళ గణేష్, బాను, అరవింద్, నీలా నాగరాజు,లింబాద్రి, పరమేశ్వర్, బర్ల స్వామి, బట్టు నర్సింలు విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లి తండ్రులు పాల్గొన్నారు.






