బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల దిష్టిబొమ్మ దహనం

11-09-2026 | 05:25am

అంబేద్కర్, స్పీకర్ ప్రసాద్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం

ఘట్ కేసర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ పరిధి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వర్యంలోతెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమ్పా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీల దిష్టిబొమ్మ దహనం చేశారు. అంబేద్కర్, స్పీకర్ ప్రసాద్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, గౌరవ అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీక్ప అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమే అన్నారు.

స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని, ఇలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.ఈఆత్మగౌరవ ప్రదర్శనలో ఘట్ కేసర్, ఎదులాబాద్ డివిజన్ ల అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, సామల అమర్, పోచారం డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బద్దం నరసింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు గణేష్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, నాయకులు పాలడుగు అమరేందర్ రెడ్డి, బండ్లగూడ నాగేష్ గౌడ్, ఎర్ర మాధవి, పోలగోని సహదేవ్, రడమల్ల భోజిరెడ్డి, పసులాది నర్సింగ్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు