ఢిల్లీకి బీఆర్‌ఎస్ బృందం
- నేడు ఎన్‌డబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌సీతో భేటీ
- మహిళా ఎమ్మెల్యేలపై దాడికి సంబంధించి ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ ఆవరణ(Telangana Assembly premises)లో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల(BRS women MLAs)పై జరిగిన దాడి ఘటనను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్(Bharat Rashtra Samithi) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్(National Commission for Women), జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission)కు ఫిర్యాదు చేసేందుకు మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy), సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), జగదీష్‌రెడ్డి(Jagadish Reddy), ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి(MLA Kova Lakshmi), పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy)తోపాటు ఎమ్మెల్సీ వాణిదేవి(MLC Vani Devi) ఢిల్లీకి వెళ్లారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల(Assembly meetings) సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్లో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు(Police) వ్యవహరించిన తీరుపై బీఆర్ ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఆవరణలోనే మహిళా ప్రజాప్రతినిధులపై దాడి చేయడం, వారిని అడ్డుకోవడం, తోపులాటకు దారితీసేలా పోలీసులు వ్యవహరించారంటూ బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రంలో ఇప్పటికే నిరసనలు, ఆందోళనలు చేపట్టిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు జాతీయ కమిషన్‌లను ఆశ్రయిస్తోంది.
ఢిల్లీలో శుక్రవారం జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌ను బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, నేతల బృందం కలవనుంది. అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ప్రతినిధులను కలిసి ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్‌లకు వివరించడంతో పాటు, అందుబాటులో ఉన్న వీడియోలు, ఇతర ఆధారాలను కూడా సమర్పిం చే అవకాశం ఉంది.
మహిళా ప్రజాప్రతినిధుల భద్రత, వారి హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి ఉండాల్సిన గౌరవం వంటి అంశాలను కమిషన్‌ల దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ నిర్ణయిం చింది. ఘటనపై స్వతంత్రంగా విచారణ జరిపి, బాధ్యులుగా భావిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక ఆవరణలోనే మహిళా ఎమ్మె ల్యేలపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులపై, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.