రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలి
మిల్లర్ల డిమాండ్.. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా
కామారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రైస్ మిల్లు(Rice Mills)లపై విజిలెన్స్ దాడుల(Vigilance raids)ను ఆపాలని, బకాయిల పేరిట మిల్లర్లను వేధించవద్దంటూ కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పప్పుల రాజేంద్రప్రసాద్ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటి వరకు మిల్లింగ్ చార్జీలను రైస్ మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం ఇచ్చిన ప్రభుత్వం మూడు నెలలకే బియ్యం తీసుకోవాలని, గోదాముల వద్ద లారీలను వారాల కొద్దీ నిల్పవద్దని కోరారు. రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలన్నారు. రైస్ మిల్ వ్యాపారులను ఇ బ్బందులకు గురి చేస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. సీఎంఆర్ మిల్ల ంగ్‌తో మిల్లర్లకు మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.
విద్యుత్ చార్జీలు, కార్మికుల వేతనాలు, రవాణా చార్జీలు మరింత పెరిగి తమకు నష్టం వచ్చిందని పేర్కొన్నారు. బకాయి పడ్డ రైస్ మిల్లులపై దాడులు చేయాలని, అన్ని రైస్ మిల్లులపై దాడులు చేయడం తగదన్నారు. ధర్నాలో రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కంచర్ల లింగం, మాజీ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ శంకర్, డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు భూమేష్ గుప్తా పాల్గొన్నారు.