06-02-2026 01:28:12 PM
ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యం
47వ సిపిఐ అభ్యర్థి జి.వి.ఆర్
పాల్వంచ,(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటు పడతానని తెలుగుదేశం బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలో నెలకొన్న వీధిలైట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు. ఓటర్ మహాశయులు కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి ఆశీర్వదించేందుకు సుముఖత చూపుతున్నారు. విద్యావంతుడు, యువకుడు కావడం వల్ల జి వి ఆర్ కు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. 47 వ డివిజన్ అభ్యర్థిగా గెలుపు లక్ష్యంగా ఆయన ప్రచారం సాగుతోంది. ఓటర్లను నేరుగా కలిసి ఓటును అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో డివిజన్ ఇంచార్జి రెహమాన్.
