calender_icon.png 6 February, 2026 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ శక్తి మహిళా సమైక్య భవనానికి భూమి పూజ

06-02-2026 01:01:08 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): మహిళలను అభివృద్ధి పథంలో తీసుకురావడానికి మహిళా సమైక్య భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు  ఆదేశానుసారం గొట్టిపర్తి గ్రామంలో శ్రీ శక్తి మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ముగ్గు పోయడం జరిగింది . ఇట్టి భవన నిర్మాణ అంచన విలువ 10 లక్షల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

గ్రామంలోని మహిళలందరూ ఒకే చోట సమావేశాలు అభివృద్ధి పనులు చేసుకుంటూ కు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో గొట్టిపర్తి గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న  గ్రామ ఉప సర్పంచ్ అన్నే బోయిన శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి  మాజీ సర్పంచ్ చంద వెంకన్న  మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లతా విజయ కుమార్ రెడ్డి  టిఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి యాకన్న ఎన్ ఎస్ యు ఐ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్అందే పరశురాం  పాల్గొన్నారు