27 July, 2026 | 8:11 PM

Breaking News

ఉరుమడ్ల మహిళల సత్తా.. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత.   •   విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి   •   తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •  

సీఎం కుర్చీపై క్లారిటీ ఇచ్చిన ఏక్ నాథ్ షిండే

27-11-2024 04:31 PM

ముంబయి,(విజయక్రాంతి): మహరాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీపై ఏక్ నాథ్ షిండే క్లారిటీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధినేత నరేంద్ర మోదీ, అమిత్ షా ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి తనతో ఫోన్ లో మాట్లాడి అభిప్రాయం తెలుసుకున్నారని షిండే పేర్కొన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఆమోదమేనని చెప్పారు. ఎన్డీఏ అధినేతగా మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని, ముఖ్యమంత్రి పదవిపై ప్రధాని మోదీ, అమిత్ షా నిర్ణయమే అంతిమమని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకిగా ఉండబోనని చెప్పినట్లు ఏక్ నాథ్ షిండే తెలిపారు.