7 July, 2026 | 3:59 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

చలివేంద్రం ఏర్పాటు

30-03-2025 05:29 PM

పాల్వంచ (విజయక్రాంతి): మండుతున్న ఎండల నుంచి బాటసారిలకు దాహార్తి తీర్చాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో స్వచ్ఛందంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. పాత పాల్వంచలోని వీరభద్ర వాటర్ సర్వీసింగ్ సెంటర్ వద్ద వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన తాగునీటి కోసం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పరిస్థితిని గమనించిన వీరభద్ర వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని ప్రజలకు తగినంత సహాయం చేద్దాం అని  చలివేంద్రం కార్యక్రమం నిర్వహించారు. పండగ సందర్బంగా మొదటిరోజు రస్నా, మంచినీరుతో ప్రజల దాహార్తి తీర్చడం పట్ల పలువురు అభినందించారు.