7 July, 2026 | 4:57 PM

అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

07-07-2026 03:43 PM

- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత, డ్రైనేజీల నిర్వహణ, దోమల నివారణ చర్యలు, క్లోరినేషన్, ఫీవర్ సర్వేలు, ప్రత్యేక జ్వర వార్డులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. జూలై 13న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యా, సంక్షేమ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.