9 June, 2026 | 1:07 AM

మల్కాజిగిరి అభివృద్ధికి ఈటల రాజేందర్ సేవలు కొనసాగాలి

09-06-2026 12:00 AM
  1. మంచి రాజేష్ కుమార్ ఎంపీగా రెండేళ్ల పదవీకాలం 
  2. పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు

నాగోల్, జూన్ 8 (విజయక్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఎంపీగా రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన డివిజన్ అధ్యక్షులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంచి రాజేష్ కుమార్ మాట్లాడుతూ, పార్లమెంట్లో ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావిస్తూ మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఈటల రాజేందర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తన విజయానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.