ఆమరణ నిరాహారదీక్ష చేస్తా
ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలి
విద్యార్థి రక్షణ దీక్ష’లో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ఎల్బీనగర్, జూన్ 8: ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సోషల్ జస్టిస్ పార్టీ సోమవారం హయత్ నగర్ చౌరస్తాలో నిర్వహించిన విద్యార్థి రక్షణ దీక్షకు ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
గతంలో ఎన్నో పోరాటాలు చేసిన ఫలితమే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకమని, దానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహిస్తున్నాడని, రేవంత్ రెడ్డి ఈ వైఖరి మానుకోకపోతే ముఖ్యమం త్రి పీఠం నుంచి దించేస్తామని ఆయన హె చ్చరించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటపాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విధంగా జీవో నెంబర్ ఏడు తీసుకొచ్చారని, దానికి ఏదో బంగారు పూత పూసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీ ఇంటలెక్సల్స్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు విద్యార్థి రక్షణ దీక్షను ప్రారంభిస్తూ పాఠశాల స్థాయిలోనే లక్షలాది రూపా యలు ఫీజులు వసూలు చేయడం, రాష్ట్రం లో విద్య హక్కు చట్టం అమలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి ఉదాహరణ పేర్కొన్నారు. ఫీజు నియాత్రలకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మన ఆలోచన సాధన సమితి అధ్యక్షుడు కటకం నరసింహారావు, తెలంగాణ లోహియా కాచం సత్యనారాయణ, మేనిఫెస్టో సాధన సమితి అధ్యక్షుడు చెరుకు నాగభూషణం, తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాలకూరి అశోక్ గౌడ్, బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షుడు బొమ్మ రఘు రాం నేత, బీసీ విద్యార్థి నాయకులు కనకాల శ్యామ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ బైరు శేఖర్ సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు తదితరులు పాల్గొన్నారు.






