భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా ఉండాలి
హక్కులను సాధించుకోవాలి
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపు
సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, తాపీ మేస్త్రీలు అన్నదమ్ములాంటివారు: బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
తాపీ మేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సెంట్రింగ్ కాంట్రాక్టర్లు వెనక్కి తీసుకోవాలి: భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలన్న
ముషీరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు సోమవారం భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ ధర్నా నిర్వహించారు.
సంగం గ్రేటర్ అధ్యక్షుడు సూర్య వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై మాట్లాడుతూ కార్మిక సంఘం నుం డి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు కార్మికులకు అందాలని అన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమా ర్ మాట్లాడుతూ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తా పీ మేస్త్రీలు అన్నదమ్ములాంటివారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి వీరి మధ్య రాజీ కుదిరించాలని కోరారు.
ఎలాంటి వైరుధ్యాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ ఫోన్లో సందేశం ఇస్తూ కార్మికుల ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేట్లు కృషి చేస్తామన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలన్న మాట్లాడుతూ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తాపీ మేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్ని పోలీస్ స్టేషన్ లలో మంగళవారం భవన నిర్మాణ కార్మికులు ర్యాలీగా వెళ్లి సెంట్రింగ్ కార్మికులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ నెల10 నుండి నుండి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు బంద్ పాటిస్తారని బందుకు పిలుపునిచ్చారు. తాపీ మేస్త్రీలకు కూడా రేట్లు పెరగాలని కోరారు.
సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురుగు యాదగిరి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చొక్కాపురం శ్రీరాములు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఆదిరాల రవికుమార్, హైదరాబాద్ అన్ని జోన్ల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ జిల్లాల భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..






