28 June, 2026 | 5:15 PM

నిండు జీవితానికి రెండు చుక్కలు

28-06-2026 04:07 PM

– ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

కోనరావుపేట,(విజయక్రాంతి): ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోనరావుపేట సర్పంచ్ మస్కూరి కాశీరం పిలుపునిచ్చారు. ఆదివారం కోనరావుపేట గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ఆయన హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్‌తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశాన్ని పోలియో రహితంగా నిలబెట్టడంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ఐదేళ్లలోపు ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్యశాఖ చేపట్టే ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్తు తరాలను పోలియో బారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు.