28 June, 2026 | 5:20 PM

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య.!

28-06-2026 04:10 PM

ఊర్కొండ: మండలం పరిదిలోని తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన తరుణ్ (19) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతితో ప్రేమ విఫలం కావడమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు.