21 March, 2026 | 6:53 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

రామాలయ పునః ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

21-03-2026 02:06 PM

 ఈ నెల 23 నుండి ఐదు రోజుల పాటు వైభవంగా వేడుకలు. 

హిందువులు భారీగా తరలిరావాలి

తాండూరు, మార్చి 21,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం ఇందిరానగర్ లో పునర్ నిర్మించిన శ్రీ రామ్ మందిర్ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఈనెల 23వ తేదీ నుండి ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నామని  హిందూ సంఘాలు ,యువకులు ,మహిళలు,భక్తులు భారీ సంఖ్యలో  పాల్గొనాలని ఆలయ నిర్వాహక కమిటీ పిలుపునిచ్చారు. దాతలు, భక్తులందరి సహాయ సహకారాలతో  వైభవంగా నిర్మితమైన ఈ ఏకైక రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఈ నెల 23వ తేదీన ఉదయం 6 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు .ఉదయం 7 గంటల నుండి శ్రీ భద్రప్ప స్వామి హనుమాన్ దేవాలయం నుండి నూతన రామాలయం  వరకు మూల విరాట్ల విగ్రహ శోభాయాత్ర ఉంటుంది.

మార్చి 24: ఆలయంలో శాస్త్రోక్తంగా  శ్రీ గణపతి హోమాలు, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

మార్చి 25: అత్యంత కీలకమైన విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో పాటు సీతారామచంద్ర మూర్తుల మరియు వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠాపనలు   

మార్చి 26: కళ్యాణోత్సవానికి సన్నాహక కార్యక్రమంగా ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరుగుతుందన్నారు. 

 మార్చి 27: లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర మూర్తుల కళ్యాణోత్సవంతో వేడుకలు అన్నదాన కార్యక్రమం తో ముగుస్తాయని వెల్లడించారు. ఈ ఐదు రోజుల ఆధ్యాత్మిక వేడుకల్లో తాండూరు పరిసర ప్రాంతాల హిందువులు  భారీగా పాల్గొని భజన, కీర్తనలతో  దిగ్విజయం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.