4 August, 2026 | 1:49 AM

పేలిన గ్యాస్ సిలిండర్

04-08-2026 12:00 AM

తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు 

మేడ్చల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): గ్యాస్ సిలిండర్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులు గాయపడ్డ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరంగ వరం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం  శ్రీరంగ వరంలో చింతల శ్రీనివాస్ తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో తండ్రి శ్రీనివాస్ తో పాటు ఆయన పిల్లలు  ప్రవళిక(14) హరిప్రియ (10) కుమారుడు విక్రాంత్ (6) తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో శ్రీనివాస్ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. అర్ధరాత్రి వేల ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు దిగ్బ్రాంతికి గురై వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ  తండ్రి శ్రీనివాస్ ఆయన పిల్లలకు స్థానికంగా ప్రధమ చికిత్స చేసి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.