31-08-2025 06:19:42 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి వాడ కాలనీలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా నాయకులు తుడసం శంభు డిమాండ్ చేశారు. ఆదివారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద నిలిచిపోయిన నీరు మురికి కాలువల్లో ఉన్న చెత్త అపరిశుభ్రత వాతావరణం పిచ్చి మొక్కలు వంటి సమస్యలను పరిశీలించి వాటిని అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.