calender_icon.png 31 August, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవ్వాల్ టైగర్ జోన్ నుంచి భారీ వాహనాలకు అనుమతులు

31-08-2025 06:15:20 PM

మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే బొజ్జు ధన్యవాదాలు

అదిలాబాద్,(విజయక్రాంతి): కవ్వాల్ టైగర్ జోన్ నుంచి భారీ వాహనాలకు అనుమతులు ఇవ్వడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం మంత్రి ని అసెంబ్లీ ఛాంబర్ లో కలిసి శాలువతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా కవ్వాల్ టైగర్ జోన్ గుండా భారీ వాహనాలకు అనుమతులు లేకపోవడంతో జన్నారం, కడెం, ఉట్నూర్, దండేపల్లి, తదితర మండలాల వ్యాపారస్తులు, ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు ఈ సందర్భంగా మంత్రికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పాలగోరి ఆదివాసీ సమస్యలను కూడా మంత్రి కి వివరించారు. దానితో పాటు అటవీ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల తెగిపోయిన రోడ్ల మరమ్మతులకు అనుమతించాలని మంత్రి నీ కోరడం జరిగిందన్నారు. దింతో మంత్రి  సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.