calender_icon.png 31 August, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

31-08-2025 06:24:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరం అని పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ దిశానిర్దేశాలపై,  ఏఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్ సూచనల మేరకు నిర్మల్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, మద్యం సేవనం, మైనర్ల చేత వాహనాల నడపడం వంటి సామాజిక సమస్యలపై ప్రజలకు విపులంగా అవగాహన కల్పించారు. అలాగే ఆస్తి సంబంధ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. రాబోయే గణపతి నిమజ్జన యాత్రలో డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, వాటి వలన కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరించారు.