కార్యకర్తలపై అసత్య ఆరోపణలు

12-09-2026 | 08:29pm

బెజ్జంకి: మానకొండూర్ నియోజకవర్గం(Manakondur Constituency)లోని ఆరు మండలాల్లో బీఆర్‌ఎస్(BRS) తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టేందుకు బిఆర్ఎస్ నాయకులకు ఒక్క దళిత నాయకుడు కూడా దొరకలేదా అని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు(Congress SC cell leaders) కొంకటి రాములు, మాతంగి అనిల్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులను అవమానకరంగా సంబోధించడాన్ని ఖండించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దళితులకు పార్టీ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కల్పించి గౌరవిస్తున్నారని తెలిపారు.

ఇకపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కొంకటి రాములు, మాతంగి అనిల్, ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, కర్రావుల సందీప్,వార్డు సభ్యులు ఎలిగే సతీష్,తిరుపతి,వివిధ గ్రామాల అధ్యక్షులు బోనగిరి ప్రసాద్. చిలుముల మోహన్,మాతంగి భాస్కర్,అమరాజు ప్రశాంత్, డైరెక్టర్ పుల్ల పోచయ్య,దొమ్మట శ్రీహరి,బోనగిరి శ్రీనివాస్,శేఖర్,శ్రీధర్,శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు