శ్రీ భీమేశ్వరస్వామి సేవలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల
వేములవాడ, ఫిబ్రవరి 25,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని బుధవారం ప్రముఖ యాంకర్ సుమ కనకాల దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకొని, వేములవాడ క్షేత్రానికి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి, స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నునుగొండ రాజేందర్,జూనియర్ సహాయకులు నరాల రాజు, ఆలయ అర్చకులు మామిడిపల్లి శరత్ కుమార్, గోపన్నగారి చందు తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.




