16 March, 2026 | 9:43 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సాగునీటి కోసం రైతులు రాస్తారోకో

16-03-2025 03:50 PM

చేగుంట,(విజయక్రాంతి): సాగునీటి కాలువ కోసం గజ్వెల్ నుండి చేగుంటకి వచ్చే దారిని కసాన్ పల్లి, చందయి పెట్, మాచిన్ పల్లి, పోతన్ పల్లి గ్రామ రైతులు రాస్తారోకో చేయడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న దౌల్తాబాద్ పోలీసులు, ఎస్ఐ, ఇరిగేషన్ డిఈ, తోగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ తో రేపు మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ... రామాయంపేట వెల్ కెనాల్ నుండి మా గ్రామాలకు నీళ్ల ఇవ్వండి.

దీంతో మా ఎనిమిది గ్రామాల ప్రజలు బతుకుతారు. అలాగే రామాయంపేట వెల్లే కెనాల్ నుండి కేవలం 100 మీటర్ వరకు చిన్న కాలువ తీస్తే మాకు నీళ్ల వస్తాహి, మేము ఎన్ని సార్లు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఉన్నతాధికారులకు విన్నవించిన ఎవరు పట్టించుకోలేదని వాపోయ్యారు. ఇప్పటికైనా జిల్లా మంత్రివర్యులు కొండ సురేఖ, అలాగే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి  దీనిపైన వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.