19 March, 2026 | 8:25 AM

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి

19-03-2026 12:32 AM

తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళాలో కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్ /కౌడిపల్లి, మార్చి 18(విజయ క్రాంతి) :మారుతున్న వాతావరణ పరిస్థితు లు , వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతు లు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ ఆధ్వర్యంలో అధిక సాంద్రత  సాగుపై కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్  ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

జ్యోతి ప్రజ్వలన చేసి కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ వ్యవసా య స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, పంటల నిర్వహణ విధానాలు, యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా సందర్శించి రై తులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రజా పాలన 99 రో జుల ప్రగతి ప్రణాళికలో  భాగంగా కిసాన్ మేళా  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రైతులు శాస్త్రవేత్తలు సూచించే ఆధు నిక పద్ధతులను అనుసరించడం ద్వారా పం టల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలు, శాస్త్రీయ సూచనలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు.

పంట మార్పిడి పద్ధతులను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. అనంత రంజిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. 

ఈ కార్యక్రమంలో వెయ్యి మంది రైతులు పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయాల చైర్మన్  రెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో. రామకృష్ణ, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నల్కర్ ,  ఉద్యానవన శాఖ అధికారి  ప్రతాప్ సింగ్ , జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, స్థానిక సర్పంచ్లు, రైతు సోదరులు పాల్గొన్నారు.