4 May, 2026 | 4:55 AM

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

04-05-2026 03:07 AM

గ్రామ సర్పంచ్ రాజు

కోయిల్ కొండ, మే 3 : రైతులు వరి కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కొత్లాబాద్ గ్రామ సర్పంచ్ రాజు అన్నారు. ఆదివారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు సంపూర్ణంగా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ క్రాంతి రెడ్డి, మాజీ ఎంపిటిసి టి సత్తయ్య గౌడ్, గ్రామ వార్డు మెంబర్లు, రైతులు ఉన్నారు.