ప్రభుత్వ విప్‌కు ధన్యవాదాలు తెలిపిన రైతులు
రుద్రంగి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మండుటెండలో చెరువులను నింపిన ఘనత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కె దక్కిందని సంతోషం వ్యక్తం చేసిన రైతులు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అచ్చయ్య కుంట చెరువు నింపడానికి ఎల్లంపల్లి నీటి విడుదలకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... ఈ సంవత్సరం నాలుగవసారి ఎల్లంపల్లి నుండి నీటిని మల్యాల పంప్ హౌస్ ద్వారా రుద్రంగికి విడుదల చేయడం జరిగిందని,ఇప్పుడు అచ్చయ్య కుంటకు నీటిని విడుదల చేయడం చాలా సంతోసంగా ఉందని అన్నారు. అచ్చయ్య కుంట చెరువు నింపడం ద్వారా రామకిష్టపూర్ పల్లె,నేవురి పల్లె ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య ఉండదని ఆ ప్రాంతంలో భూగర్భజలాలు పెరుగుతాయని అలాగే ముగజీవాలకు నీరు అందుతుందని వ్యవసాయ బావుల్లో బోర్ మోటర్లలో నీరు వచ్చి చేరుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నీటి విడుదలకు కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ,ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,నాయకులు ఎర్రం గంగానర్సయ్య,గడ్డం శ్రీనివాస్,బైరి గంగమల్లయ్య,తర్రె లింగం,పున్నూరు శ్రీనివాస్,ఎర్రం అరవింద్,పుదరి మహిపాల్, ఆర్ముర్ నర్సయ్య,రైతులు తదితరులు పాల్గొన్నారు.






