calender_icon.png 11 November, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీల కొరతతో హార్వెస్టర్ ఉపయోగిస్తున్న రైతులు

11-11-2025 12:42:36 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలో విపరీతంగా కూలీల కొరత ఉండడంతో వరి కోసేందుకు రైతులు హార్వెస్టర్ వరి కోసే యంత్రాలు ఉపయోగిస్తున్నారు. మండలంలో గత కొన్ని రోజుల క్రితం వర్షాలు కురవడంతో వరి కోతలు ఆలస్యమయ్యాయి. దీనితో పత్తి, వరి కోతలు ఒకేసారి కావడంతో పత్తి తీసేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. 

ఒక కిలో పత్తి తీస్తే రూ.10 ఇస్తున్నారని ఒకరోజు ఒక కూలి 50 కిలోల నుండి క్వింటల్ వరకు తీస్తున్నట్లు తెలుపుతున్నారు. దీనితో వరికోసేందుకు కూలీలు దొరకకపోవడంతో రైతులు వరికోసేందుకు హార్వెస్టర్ వరి కోసే యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. వర్షాల కారణంగా వరి కోతలు ఆలస్యం కావడంతో  రైతులు వరి కోసేందుకు కూలీల కొరత ఉండడంతో హార్వెస్టర్ కోసం రైతులు పోటీ పడుతున్నారు.