ట్యూషన్‌కు డుమ్మా కొట్టాడని తండ్రి ఆగ్రహం
బాలుడు అదృశ్యం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ట్యూషన్‌కు డుమ్మా కొట్టాడని తం డ్రి మందలించడంతో మనస్తాపం చెందిన 15 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన గండిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. మణికొండకు చెందిన కురువ మల్లేష్ (38), వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు కే శ్రీకాం త్ (15) స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
గత నెల 18న ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడంతో తండ్రి మల్లేష్ కొడుకుపై ఆగ్ర హించడంతో మరుసటి రోజు ఉదయం శ్రీకాంత్ క్రికెట్ ఆడేం దుకు గ్రౌండ్‌కు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇం టి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గ్రౌండ్‌లో, స్నేహితుల ఇళ్లలో వెతికారు. బంధువులకు ఫోన్లు చేసి ఆరా తీసినా ప్రయోజనం లేకపోవండంతో తండ్రి మల్లేష్ గండిపేట్ పీఎస్‌ను ఆశ్రయించాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






