గణపురం జడ్పీహెచ్ఎస్లో ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు
మెరిట్ స్టూడెంట్లకు దాతలు క్యాష్ ప్రైజ్‌లు అందజేత
గణపురం, ఆగస్టు15 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం దేసు సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు పలువురు దాతలు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. గతేడాది పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన ఎండీ ఫహీమా, ఆర్.జాషువాకు దాత నల్లు సూర్య ప్రకాశ్ రెడ్డి తలా రూ. 12,000 చొప్పున క్యాష్ ప్రైజ్ అందించారు.
అలాగే ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న టెన్త్ స్టూడెంట్ జగదీశ్వర్‌కు రూ. 5,116, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహణ కోసం స్కూల్‌కు రూ. 5,000 అందజేశారు. గతేడాది టెన్త్‌లో సెకండ్ ప్లేస్ సాధించిన ఎ. జ్యోత్స్నకు దాత కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి రూ. 5,000 అందజేశారు. ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతున్న ఎం. జగదీశ్వర్‌కు సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ రూ. 1,000, ఎంఈవో ఎండీ అఫ్రోజ్ రూ. 2,000, కన్నెబోయిన కుమార్ యాదవ్ రూ. 1,000 ప్రోత్సాహకంగా ఇచ్చారు. ప్రస్తుతం చదువుతున్న టెన్త్ స్టూడెంట్ల స్టడీ మెటీరియల్ కోసం ఎండీ చోటే మియా రూ. 5,116, ఉప సర్పంచ్ కృష్ణ రూ. 2,500, వార్డు మెంబర్ అబేధా రూ. 2,500 ఆర్థిక సాయం అందించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన దాతలకు హెచ్ఎం సతీష్ కుమార్, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






