15 August, 2026 | 6:36 PM

ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత

15-08-2026 04:55 PM

మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని పలు శాఖలలో విధులు ఉత్తమంగా నిర్వహించిన 90 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు శని వారం బెల్లంపల్లి ఎంఎల్ఏ గడ్డం వినోద్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీసీపీ ఎగ్గడి భాస్కర్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ ఆలీ, జిల్లా అధికారులతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు. 

రెవెన్యూ డిపార్టుమెంట్ (కలెక్టరేట్ స్టాఫ్)లో దేశ్ పాండే శ్రీనివాస్ రావు (ఏఓ), బీ కవిత (నాయబ్ తహశీల్దార్ డీ సెక్షన్), పీ సీహెచ్ ఎస్ ఫణి కుమార్ (సీనియర్ అసిస్టెంట్ ఏ సెక్షన్), డీ సమ్మక్క (సీనియర్ అసిస్టెంట్ బీ సెక్షన్), ఎం ఆమని (సీనియర్ అసిస్టెంట్ సీ సెక్షన్), డీ మహేష్ (సీనియర్ అసిస్టెంట్ ఈ సెక్షన్), కే గంగాధర్ (జూనియర్ అసిస్టెంట్ ఏ సెక్షన్)లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 

అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పేశిలో టీ రాజేంద్ర సాయి (సీసీ), టీ రాజబాపు(ఆఫీస్ సబార్డినేట్), అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పేశిలో మహ్మద్ ఇర్ఫానుద్దీన్ (సీసీ), జీ వెంకటేష్ (ఆఫీస్ సబార్డినేట్), బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీ సునిల్ కుమార్ (తహశీల్దార్ కాసిపేట), కే శ్రీనివాస్ (నాయబ్ తహశీల్దార్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం), రమేష్ (ఆర్ఐ, బెల్లంపల్లి), ఎస్ ప్రభాకర్ (ఆఫీస్ సబార్డినేట్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం), మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో డీ రోహిత్ కుమార్ (తహశీల్దార్ దండేపల్లి), డీ తిరుపతి (గిరిధవార్, జైపూర్), ఎం సుమంత్ కుమార్ (జూనియర్ అసిస్టెంట్, మంచిర్యాల), ఎల్ సత్యవతి (జూనియర్ అసిస్టెంట్, హాజీపూర్)లు అందుకున్నారు. 

సర్వే అండ్ ల్యాండ్ రికార్డు విభాగంలో ఎం రామకృష్ణ (డిప్యూటీ సర్వేయర్, తాండూరు), డీపీఆర్ఓ విభాగంలో కే సంపత్ కుమార్ (టైపిస్ట్), డీ తారాబాయి (ఆఫీస్ సబార్డినేట్), డీడబ్ల్యూఓ విభాగంలో వీ ప్రసన (గ్రేడ్ 1 సూపర్వైజర్, బెల్లంపల్లి), రజియా సుల్తానా (అంగన్వాడీ టీచర్, చెన్నూర్), మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి మహ్మద్ అబ్దుల్ ఖాదీర్ (ఏఈఈ), ఎస్ఈ మిషన్ భగీరథ నుంచి దాసరి శిరీష (సీనియర్ అసిస్టెంట్), డీటీఓ నుంచి గాదె సాయి లెనిన్ (ఏఎంవీఐ), సీపీఓ నుంచి బీ రాజేందర్ (డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్), బీ సురేష్ కుమార్ (డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్), జిల్లా ఆసుపత్రి నుంచి టీ జోసెఫిన్ (నర్సింగ్ సూపరింటెండెంట్), ఏ సుజాత (స్టాఫ్ నర్సు), డీపీఆర్ఈ నుంచి సీహెచ్ మహేందర్ (ఏఈఈ, పీఆర్ ఎస్ డీ, బెల్లంపల్లి), ఎండీ మజార్ ఆలీ (ఏఈఈ, పీఆర్ ఎస్ డీ, జైపూర్), ఇఇ ఆర్ అండ్ బీ నుంచి కే శైలేందర్ (ఏఈఈ)లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

సివిల్ సప్లయ్స్ కార్యాలయం నుంచి పీ భూమేష్ (సివిల్ సప్లయ్స్ ఇన్ స్పెక్టర్), సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ నుంచి పిన్ రెడ్డి రాజు (అకౌంటెంట్), ఏ శ్రీలత (డీఈఓ), విద్యాశాఖ నుంచి వీ ధీరజ్ (సీనియర్ అసిస్టెంట్), ఎం రవి కుమార్ (జూనియర్ అసిస్టెంట్), ఆర్ రమేష్ (ఎంఈఓ మందమర్రి), ఏ సింధూర (ఎంఐఎస్, జైపూర్), వైద్య శాఖ నుంచి బీ సూర్యకాంత్ (ఆశా,ఇటిక్యాల), డాక్టర్ ఆచి లహరి (ఎంఓ, హాజీపూర్), డీఆర్డీఏ నుంచి కే రాజ కుమార్ (ఏపీఎం, సదరం), బీ స్వరూపారాణి (అకౌంటెంట్), బీ రాజు నాయక్ (అడ్మిన్ అసిస్టెంట్), సత్యప్రసాద్ (ఏపీఎం, భీమిని), డీపీఓ నుంచి పొడిశెట్టి సురేష్ (పంచాయతీ సెక్రటరీ, ముదిగుంట జైపూర్), ఉమర్ షరీఫ్ (ఎంపీఓ, జన్నారం), అటవీ శాఖ నుంచి ఎం మహిపాల్ (ఎఫ్బీఓ కోటపల్లి), సీహెచ్ ప్రమోద్ కుమార్ (ఎఫ్బీఓ కుర్రేగాట్), కే గౌరీ శంకర్ ( డిప్యూటీ ఆర్ఓ, బెల్లంపల్లి), డీ బాలాకృష్ణ (ఎఫ్ఎస్ఓ, కుశ్నపల్లి)లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

పోలీసు విభాగం నుంచి జీ రవిందర్ (సీఐ మంచిర్యాల రూరల్), ఆర్ కృష్ణ (సీఐ చెన్నూర్ రూరల్), ఏ మధుసూదన్ రావు (ఎస్ఐ, మంచిర్యాల), హైమా (ఎస్ఐ, షీటీం), బీ సదానందం (హెడ్ కానిస్టేబల్, సీసీసీ నస్పూర్), కే రంజిత్ (కానిస్టేబుల్, సీసీసీ నస్పూర్), జే రాజబాబు (హెడ్ కానిస్టేబుల్, హాజీపూర్), బీ దివాకర్ (ఏఎస్సై, మంచిర్యాల), మహ్మద్ అన్వర్ (హెడ్ కానిస్టేబుల్, మంచిర్యాల), పీ మహేష్ బాబు (కానిస్టేబుల్, మంచిర్యాల), జీ శ‌ృతి (కానిస్టేబుల్, జన్నారం), బీ రవి (కానిస్టేబుల్, శ్రీరాంపూర్), బీ భరత్ (కానిస్టేబుల్, నీల్వాయి), ఎండీ నశీర్ పాషా (కానిస్టేబుల్, భీమారం), కే ఇబేనీజర్ (హెడ్ కానిస్టేబుల్, భీమారం), ఎల్ సరోజ (కానిస్టేబుల్, బెల్లంపల్లి 1 టౌన్), అలీ బిన్ సలేహ (ఏఎస్సై, తాళ్లగురిజాల), ఎస్ విజయ్ కుమార్ (హెడ్ కానిస్టేబుల్, నెన్నెల), ఎస్ బొజ్జు బాయి (కానిస్టేబుల్, మాదారం), బీ వినోద్ కుమార్ (కానిస్టేబుల్, భీమిని), జీ బాలకృష్ణ (కానిస్టేబుల్, కన్నేపల్లి), జీ సతీష్ (కానిస్టేబుల్, షీటీం), డీ శ్రీలత (కానిస్టేబుల్, షీటీం), ఈ రవీందర్ కుమార్ (ఏఆర్ఎస్సై, సీఏఆర్ బెల్లంపల్లి), ఆర్ శ్రీనివాస్ (కానిస్టేబుల్, సీఏఆర్ బెల్లంపల్లి) లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

న్యాయవిభాగం నుంచి డాక్టర్ ఏ రాంబావు (స్పెషల్ పీపీ, పోస్కో కోర్టు), కే సత్య శ్రీలత (పీపీ, ప్రిల్, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు), నంది రవీందర్ (ఏపీపీ), క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ నుంచి ఎండీ రఫీక్ (ఏఆర్ ఎస్సై, సీఐడీ, కరీంనగర్ రిజినల్ ఆఫీస్), కే శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్,  కరీంనగర్ రిజినల్ ఆఫీస్), జోనల్ ఇంటలీజెన్సీ డిపార్ట్ మెంట్ నుంచి సీహెచ్ మిథున్ (ఇన్ స్పెక్టర్), సీహెచ్ మల్లయ్య (ఏఆర్ ఎస్సై), కే తిరుపతి (హెడ్ కానిస్టేబుల్), ఎం మధూకర్ (కానిస్టేబుల్), మెడికల్ డిపార్టుమెంట్ నుంచి ఆర్ కుమార స్వామి (ఏడీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి), ఎన్ పీ డీ సీ ఎల్ నుంచి ఏ మహేష్ (ఏఎల్ఎం, ఓపీ, మంచిర్యాల రూరల్), ఎల్ నరేందర్ (ఐఎం, ఎల్టీసీటీ మీటర్స్)లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.