12 June, 2026 | 12:07 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి

12-06-2026 11:19 AM

నిజాం సాగర్‌: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో(Nizamsagar Project) దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి కృష్ణ నిజాంసాగర్ లో దూకాడు. బంధువుల సమాచారంతో రెస్క్యూటీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ప్రాజెక్టులో నుంచి ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసింది. మృతులను తండ్రి కృష్ణ(32), కుమారుడు రక్షిత్(08), కూతురు అనన్య(5)గా గుర్తించారు. మృతులను సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. భార్య‌తో గొడ‌వ‌ప‌డి తన ఇద్దరు పిల్ల‌ల‌తో కలిసి రిజ‌ర్వాయ‌ర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.