15 March, 2026 | 5:00 AM

నేడు ఇందిరా పార్క్ వద్ద ఫీజు పోరు దీక్ష

15-03-2026 01:36 AM

హాజరుకానున్న అఖిలపక్ష నేతలు

ఫీజులు విడుదల చేసే వరకు పోరాటం ఆగదు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడి

ముషీరాబాద్, మార్చి 14(విజయక్రాంతి): గత నాలుగు సంవత్సరాలుగా పెం డింగ్‌లో ఉన్న ఫీజుల రీయింబర్స్ మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని, ఈ బడ్జెట్ లో ఫీజుల రీయింబర్స్ మెంట్స్ నిధులకు10వేల కోట్లు కేటాయించాలని ప్రధాన డిమాం డ్ చేస్తూ 15న ఆదివారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఫీజు పోరు దీక్షను చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

శనివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్  వద్ద నేడు జరిగే ఫీజు పోరు దీక్ష ఏర్పాట్లను బీసీ విద్యార్థి నేతలతో కలిసి ఆయన పర్యవేక్షించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఫీజు పోరు దీక్షకు అఖిలపక్ష పార్టీల నేత లు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు, మేధావులు ఉద్యమకారులు హాజరవు తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఫీజుల రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకుండా ఫీజుల రీయింబర్స్ మెంట్  పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తుందని, ప్రభుత్వ కుట్రలను ఎండగడతూ ఫీజు పోరు దీక్షను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఫీజు రీయిం బర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రేప టి ఫీజు పోరు దీక్షలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటలనుండి ప్రా రంభమయ్యే ఫీజు పోరు దీక్షకు రాష్ట్ర నలుమూలల నుండి బీసీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసి వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లపల్లి స్వామి, గూడూరు భాస్కర్ మేరు, బి. వేనయ, బండిగారి రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.