22 August, 2026 | 2:54 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు

02-05-2026 08:57 PM

రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ గ్రామీణ మండలం, నూకలమర్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ రోమాల ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్ హాజరై అభినందించారు.

పరీక్షల్లో గంగ దీక్షిత 555 మార్కులతో మొదటి స్థానం, వర్ణిక్ 537 మార్కులతో, అభినయ్ 499 మార్కులతో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రోమాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి కృషి, ఉపాధ్యాయుల అంకితభావమే కారణమని పేర్కొన్నారు. చదువుకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఫౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.