2 May, 2026 | 10:09 PM

25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు

02-05-2026 08:59 PM

శుశ్రుత ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నాణ్యమైన వైద్యం అందిస్తామని డాక్టర్ హామీ

సిద్దిపేట రూరల్: సిద్దిపేట పరిసర ప్రాంతాల ప్రజలకు గత 25 సంవత్సరాలుగా విశేషమైన వైద్య సేవలు అందిస్తున్న డా. మురళీ కృష్ణ గారి జన్మదిన వేడుకలు శనివారం శుశ్రుత ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రోగులు కలిసి కేక్ కట్ చేసి డాక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. మురళీ కృష్ణ మాట్లాడుతూ... శుశ్రుత ఆసుపత్రిలో నాణ్యమైన, తక్కువ ఖర్చుతో, విలువలతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులకు, తన సేవలను ఆదరిస్తున్న ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.