అధిక ధరలకు యూరియా అమ్మకం
షోషల్ మీడియా లో పోస్ట్ వైరల్..
125 బస్తాల డిఏపి సీజ్ ..
దామరచర్ల :అక్టోబర్ : 4 : దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన రైతు మిత్ర ఎరువుల దుకాణం(Rythu Mitra Fertilizer Shop) లో యూరియా ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆత్మ లో పనిచేస్తున్న కృష్ణ పేర షోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.ఆ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆత్మలో పనిచేస్తున్న ఆడోతు కృష్ణా తన స్వగ్రామం దామరచర్ల మండలం లోని జైత్రాo తండా కాగా యాప్ ద్వారా మూడు యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు.
అనంతరం యూరియా కోసం కొండ్రపోల్ లోని రైతు మిత్ర ఎరువుల షాప్ కు వెళ్ళాడు.ఒకొక్క యూరియా బస్తా రూ మూడు వందల చొప్పున మూడు బస్తాలకు రూ 900 లు ఇవ్వమని షాప్ యజమాని జనార్దన్ రెడ్డి చెప్పాడు.ఒక్కొక బస్తా రూ 266 లైతే రూ 300 లకు ఎలా అమ్ముతావని నేను వ్యవసాయ శాఖ లో పని చేస్తున్నాను ,అలా అధిక ధరలకు అమ్మితే ఎలా కృష్ణా అడగ్గా నా ఇష్టం ...ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బిల్లు గుంజుకొని చించివేసినట్లు చెప్పారు.అలాగే వాచ్యా తండాకు చెందిన కె వాల్యా కు కూడా డి ఏ పి అధిక ధరకు అమ్మినట్లు చెప్పారు.
దింతో లైసెన్స్ రద్దు చేయడం తోపాటు, షాప్ ను సీజ్ చేయాలని కోరుతూ వాడపల్లి ఎస్ ఐ , వ్యవసాయ శాఖ అధికారులకు పిర్యాదు చేసినట్లు పోస్ట్ లో తెలిపారు. ఈ విషయమై ఏ ఓ ను వివరణ కోరగా షాప్ లో గల 125 బస్తాల డి ఏ పి ని సీజ్ చేసినట్లు తెలిపారు. యూరియాను ధర పై అదనంగా ట్రాన్ పోర్ట్ చార్జీలు తీసుకోవచ్చని చెప్పారు.