కులమతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలి
కాగజ్‌నగర్, మార్చి ౧ (విజయక్రాంతి): కుల మతాలకతీతంగా శాంతియుతంగా పం డుగలను జరుపుకోవాలి డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎస్పీ నీతిక పంత్ ఆదేశాల మేరకు ముస్లిం పెద్దలు, చిరు వ్యాపారస్థులతో అవగాహన నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా నిర్ణీత సమయాల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని,
ఎలాంటి అనుమానిత వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.పవిత్రమైన రంజాన్ మాసాన్ని నియమ నిష్టలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కుమారస్వామి , ఎస్‌ఐలు సుధాకర్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.




