26 May, 2026 | 2:47 AM

ప్రజల ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి

26-05-2026 01:47 AM

వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

హనుమకొండ, మే 25 (విజయక్రాంతి): ప్రజా సమస్యలకు ప్రజా ఫిర్యాదులపై అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రతి సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు నిర్వహించే ప్రజా ఫిర్యాదులను కార్యక్రమంలో కమిషనరేట్ నలుమూలల నుండి ఫిర్యాదుదారులు తమ సమస్యలను పోలీస్ కమిషనర్ కి స్వయంగా తెలియజేశారు. సమస్యలను విన్న పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి బాధితుల పట్ల బాధ్యతాయుతంగా  వ్యవహరించాలని తెలిపారు.

ప్రజల సమస్యలను పరిష్కరించిన ప్పుడు పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయంలో దాదాపు 6 ఫిర్యాదులను సేకరించడం జరిగింది. వచ్చిన ఫిర్యాదులలో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కేసుల పురోగతి, భూ సమస్యలు, తదితర విషయాలు ఉన్నట్లు సీపీ తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా అసంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్న 8712685257 నంబర్ కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

యువ షూటర్‌ను అభినందించిన పోలీస్ కమిషనర్

కమలాపూర్ ప్రాంతానికి చెందిన స్పోరట్స్ షూటర్ గా రాణిస్తున్న ప్రస్తుతం పదవ తరగతి పూర్తి చేసుకున్న సంగెం తనిసి నూతనముగా స్పోరట్స్ గన్ కొనుగోలు చేయడం జరిగింది. దీనికి వినియోగించేందుకు సీపీ అనుమతి తప్పని సరి కావడంతో సంబందించిన అధికారులతో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను సోమవారం  కలుసుకోవడంతో వాస్తవానికి క్రీడాకారుడు కావడంతో  యువ షూటర్ తనిసితో పోలీస్ కమిషనర్ ముచ్చటిస్తూ ఆమె సాధించిన విజయాలను  అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవిష్యత్తు మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ సీపీ యువ షూటర్ ను అభినందనలు తెలిపారు.