కాంగ్రెస్ అబద్ధపు హామీలపై పోరాటం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి
01-09-2026 12:41 PM
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుద్ధవారం చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహించే ఆందోళనలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గళం విప్పాలని కోరారు.