వైద్య విద్యకు ఆర్థిక చేయూత

28-09-2026 | 06:10pm

వెల్డండ: నాగర్‌కర్నూల్ జిల్లా(Nagar kurnool District) వెల్డండ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన దువాసి సన్యా కష్టపడి చదివి ఎంబీబీఎస్(MBBS) సీటు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె ప్రతిభను తెలుసుకున్న ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి(Food Commission Chairman Goli Srinivas Reddy) సోమవారం ఆమెను అభినందించారు. అనంతరం సన్యా కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆయన రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.

విద్యాభ్యాసానికి అవసరమైన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సాయం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ నాగులు నాయక్ రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించిన సన్యాను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పుట్ట రాంరెడ్డి, జోగయ్య, నిరంజన్, ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు