15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఆడబిడ్డ జననానికి ప్రోత్సాహం

21-02-2026 09:27 PM

– రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): మున్సిపల్ వైస్ చైర్మన్ పెండాల రాజు, అతని సోదరుడు పెండాల హరికృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన ఆర్థిక సహాయ హామీ అమలులో భాగంగా 17వ వార్డులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

17వ వార్డుకు చెందిన ఆలూరి ఆదిలక్ష్మి కుమార్తె జెసిక లక్ష్మీదేవి రూపంలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా ముందుగా ఇచ్చిన హామీ మేరకు పెండాల రాజు, పెండాల హరికృష్ణలు ఆదిలక్ష్మి నివాసానికి వెళ్లి రూ.5,000 నగదు సహాయాన్ని స్వయంగా అందించారు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి కుటుంబానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా సమాజంలో సానుకూల సందేశం పంపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాడిశెట్టి రాజు, ఎస్‌డీ బాబా, జియా, ఆలూరి విజయ్, హసీనా తదితరులు పాల్గొన్నారు.