17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మున్సిప‌ల్ చైర్‌పర్సన్‌గా బండారి అనూష బాధ్య‌త‌లు స్వీకరణ

21-02-2026 09:32 PM

మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్న నూతన చైర్పర్సన్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిప‌ల్ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి త‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని మున్సిప‌ల్ నూతన చైర్ప‌ర్స‌న్ బండారి అనూష స‌తీష్ అన్నారు. శ‌నివారం మున్సిప‌ల్ కార్యాల‌యంలోని త‌న ఛాంబ‌ర్ లో ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వేదపండితుల పంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్త పూజ‌ల అనంత‌రం త‌న సీట్లో ఆసీనుల‌య్యారు. స‌ర్వ‌మ‌త ప్రార్ధ‌న‌ల‌తో ఆశీర్వ‌చ‌నాలు అందించారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు, కౌన్సిల‌ర్లు ఆమెకు అభినంద‌న‌లు తెలియ‌చేసారు.త‌న‌కు ప‌ద‌వి ద‌క్కేలా కృషి చేసిన ప్ర‌తీ ఒక్క‌రికి అనూష కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 49 వార్డుల‌లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌న్నారు. మున్సిప‌ల్ అభివృద్ధే త‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మ‌న్ మ‌హ్మ‌ద్ రోహిత్, నాయకులు కంది శ్రీ‌నివాస రెడ్డి, గండ్రత్ సుజాత, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి, మున్సిప‌ల్  కౌన్సిల‌ర్లు,  త‌దిత‌రులు పాల్గొన్నారు.