మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం
07-07-2026 07:50 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బొల్లె ప్రశాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న క్లస్మెట్స్ మానవత్వాన్ని చాటుతూ ఆయన కుటుంబానికి రూ.37,300 ఆర్థిక సహాయం అందజేశారు. ప్రశాంత్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉండటంతో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో స్నేహితులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు స్నేహితుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టసమయంలో స్నేహితులు చూపిన ఆదరణ అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.






