7 July, 2026 | 10:21 PM

రక్షణ, ఉత్పత్తి పరికరాల కొరతను నివారించాలి

07-07-2026 09:02 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మందమర్రి ఏరియా శాంతిఖని లో రక్షణ, ఉత్పత్తి కోసం పరికరాలను వెంటనే అందజేయాలని ఎఐటియుసి శాంతిఖని ఫిట్ కార్యదర్శి, రత్నం ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం సహాయ కార్యదర్శి,దాడి రమేష్ పలు అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని గని కాలరీ మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫిట్ కార్యదర్శి రత్నం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు సుమారుగా గత సంవత్సరకాలంగా గనిలో పనులకు అవసరమైన పని ముట్లు,పరికరాల కొరత చాల తీవ్రంగా ఉందన్నారు.

ఉత్పత్తికి అవసరమైన డ్రిల్ బిట్లు,డ్రిల్ రాడ్ లు చెమ్మసులు,డాగ్ నైల్స్, గిరిమిట్లు, టెక్నీషియన్స్ కు అవసరమైన టూల్స్ కూడా సరఫరా చేయడం లేదన్నారు. అదేకాకుండా వెలుతురుకు ట్యూబ్ లైట్లు, కార్మికునికి అత్యంత రక్షణ పరికరాలు అయిన బూట్లు, సాక్స్ లు , గ్లాస్ లు  ఇతరత్ర సామాగ్రి  సకాలంలో అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. అదే విధంగా బొగ్గు ఉత్పత్తికి అత్యంత కీలకమైన  SDL  యంత్రాలు పూర్తిగా పాతబడి పోవడంతో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేక పోతున్నామన్నారు. పాత SDL యంత్రాలను నిరంతరం నడపడం వల్ల ఆపరేటర్లు నడుము నొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలుకు గురి అవుతున్నారని అన్నారు. 

అలాగే మ్యాన్ రైడింగ్ కు సంబంధించిన పరికరాలు హెల్మెంట్లు,నూతన క్యాప్ లాంప్ లు, జి ఐ క్యాన్సిస్టర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, షాట్ ఫైరర్ కేబుల్ ,అత్యవసర పరికరాలు  కూడా తగినంత అందుబాటులో ఉండడం లేదన్నారు. మైన్ లో 36 లెవల్ నుండి 49 లెవల్  సౌత్ లో వెంటిలేషన్ సరిగా లేదని, అందువల్ల వెంటనే గాలి బ్యాచ్ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కే జీ టైమింగ్స్ పాత పద్ధతిలోనే పెట్టాలని డిమాండ్చేశారు. శాంతి ఖని మైన్  మెయిన్ రోడ్డు నుండి ఇంటర్నల్ రోడ్డు వేయాలని అన్నారు

ఫేస్ వర్కర్లు తక్కువగా ఉన్నారు. పోల్ షాపింగ్ పోస్ట్ ను వెంటనే నియమించాలి, డిస్ట్రిబ్యూషన్ ను పాత పద్ధతిలోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారే డిస్ట్రిబ్యూషన్ చేసుకునేలా చేయాలన్నారు. మైన్ లో ఖాళీ ఉన్న పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలినీ,  మైన్ కు కరెంట్ పోతే  కే జీ మద్యలోనే ఆగిపోయి కార్మికులు చాల ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కే జీ కి ప్రత్యేకంగా ఒక జెనరేటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఈ కార్యక్రమంలో శాంతిఖని కార్మికులు పాల్గొన్నారు.