7 July, 2026 | 9:41 PM

కరముంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో విజయవంతంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం

07-07-2026 08:47 PM

నాగల్‌గిద్ద: నాగల్‌గిద్ద మండలం కరముంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో కరముంగి, కరస్‌ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌పీవీ  వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ప్రాధాన్యతపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, వారి సమ్మతితో టీకాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్‌రావు, గ్రామ సర్పంచ్ రవి కుమార్ పాటిల్, కారా ముంగి వైద్యాధికారి పూజ పాటిల్, ఐకేపీ ఏపీఎం నర్సింలు, ఉపసర్పంచ్ విశ్వనాథ్, కరముంగి  పీహెచ్‌సీల వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.