ఆపదలో తోటి డ్రైవర్ల చేయూత

12-09-2026 | 11:13pm

లింగరాజు కుటుంబానికి రూ.1.10 లక్షల ఆర్థిక సాయం

గరిడేపల్లి,(విజయ క్రాంతి) మండలంలోని రాయినిగూడెం: గ్రామానికి చెందిన లారీ డ్రైవర్(lorry driver) గుండు లింగరాజు పది రోజుల క్రితం వృత్తిరీత్యా డ్యూటీకి వెళ్లి, మార్గమధ్యలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో వడదెబ్బకు గురై మృతి చెందాడు. శనివారం నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమంలో తోటి డ్రైవర్లు పాల్గొని లింగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు డ్రైవర్లు కలిసి రూ.1.10 లక్షల ఆర్థిక సాయాన్ని(Financial assistance) అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండ సైదులు, గుండు సైదులు, లక్ష్మీనారాయణ, అజయ్, నాగేంద్రబాబు, నాగరాజు, ఆకుల గోపీచంద్, వేణు, గోపీ తదితర తోటి డ్రైవర్ మిత్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు