ఎంబిబిఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం

13-09-2026 | 12:13am

సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోనీ విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ లు మిన్న విజయలక్ష్మి, శివరామకృష్ణ  దంపతులు తమ సామాజిక బాధ్యతను మరోసారి చాటుకున్నారు. ఇటీవల పెన్ పహాడ్ మండలం(Penpahad Mandal) అనంతారం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులు(poor students) భీపంగ యశ్వంత్ నీట్(NEET) లో 1301 ర్యాంకు సాధించి ఉస్మానియాలో  మామిడి ఇందు నీట్ లో 10150 ర్యాంకుతో గాంధీ హాస్పిటల్లో  ఎంబిబిఎస్ సీట్లు(MBBS seats) సాధించడం పట్ల అభినందిస్తూ ఒక్కొక్కరికి రూ :25 వేల చొప్పున  ఆర్థిక సహాయంతో పాటు మొదటి సంవత్సరానికి ఉపయోగపడే పుస్తకాలను అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఉన్నత వైద్య విద్యలో సీటు సాధించడం ఆనందంగా ఉందన్నారు.  వారు ఇరువురు పేదరికంలో ఉన్నారని చదువుకునేందుకు పేదరికం అడ్డుకాకూడదని ఆలోచనతో తాము ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. సమాజం కూడా స్పందించి వారి వైద్యవిద్యకు సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే ద్వితీయ,  తృతీయ సంవత్సరాలలో కూడా ఇరువురి విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలను తమ ద్వారా అందజేస్తామన్నారు. డాక్టర్ దంపతుల దాతృత్వం పట్ల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు