25 June, 2026 | 6:40 PM

కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా వర్క్‌షాప్‌లో మంటలు

28-04-2026 03:41 PM

హైదరాబాద్: నగరంలోని బహదూర్ పురాలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. కిషన్ బాగ్(Kishan Bagh) లోని సోఫా తయారీ కేంద్రంలో భారీగా మంటలు ఎగిరిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ కమ్మేసింది. మంటల ధాటికి సిబ్బంది, స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. లక్షల విలువైన ఫర్నిచర్, సోఫా సెట్లు, ఫ్లైవుడ్లు, సోఫా సామాగ్రి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.